PM Kisan: పీఎం కిసాన్‌ అప్‌డేట్‌.. eKYCకి నేడే లాస్ట్‌ డేట్‌

PM Kisan Update: పీఎం-కిసాన్‌ నిధులు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇది జరగాలంటే తప్పకుండా ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Updated : 10 Feb 2023 11:01 IST

దిల్లీ: రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి (PM Kisan) 13వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఎవరైతే ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేస్తారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. ఫిబ్రవరి 10 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికే నిధులు జమ అవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది వరకే ఈ-కేవైసీ పూర్తిచేసిన వాళ్లకి ఆధార్‌ నంబర్‌ అప్‌డేట్‌ అయినట్లు అక్కడ చూపిస్తుంది.

ఇప్పటి వరకు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీని గానీ, లేదంటే దగ్గర్లోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ వద్ద బయోమెట్రిక్‌ ఆధారిత ఇ-కేవైసీని గానీ పూర్తి చేయాలి. అలాగే, ఆధార్‌తో బ్యాంక్‌ ఖాతా లింక్‌ అయిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ఆధార్‌తో బ్యాంక్‌ ఖాతా లింక్‌ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ బ్యాంక్‌ ఖాతా లింక్‌ కాకపోయి ఉంటే ఏటీఎం కేంద్రానికి వెళ్లి సర్వీస్‌ ఆప్షన్‌లో ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయొచ్చు.

పోర్టల్‌లో ఈ-కేవైసీ ఎలా..?

  • ముందుగా పీఎం కిసాన్ (https://pmkisan.gov.in/) వెబ్‌సైట్‌ని సంద‌ర్శించాలి. అక్కడ ఇ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • మీ ఆధార్‌ కార్డు నంబర్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • స్క్రీన్‌పై ఎంటర్‌ మొబైల్‌ నంబర్‌ అని కనిపిస్తుంది. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి గెట్‌ ఓటీపీని క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు మళ్లీ ఆధార్‌ రిజిస్టర్డ్‌ ఓటీపీ అనే ఆప్షన్‌ వస్తుంది. మీ ఆధార్ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేస్తే ఇ-కేవైసీ పూర్తవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని