Salman Khan: సల్మాన్‌ఖాన్‌, ఆయన తండ్రికి బెదిరింపు లేఖ!

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, ఆయన తండ్రి సలీమ్‌ఖాన్‌లను బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి  లేఖ వచ్చింది.

Published : 06 Jun 2022 01:48 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, ఆయన తండ్రి సలీమ్‌ఖాన్‌లను బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేఖ వచ్చింది. ఈ మేరకు సల్మాన్‌ ప్రతినిధులు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇటీవల పంజాబ్‌ గాయకుడు సిద్ధూ మూసేవాలాను తామే హత్య చేసినట్లు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఈ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో భాగంగా లారెన్స్‌ బిష్ణోయ్‌ను తీహాడ్‌ జైలులో ఉంచి విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని