Karnataka: బెంగళూరులో ‘సూపర్‌ డీలక్స్‌’ తరహా ఘటన.. భర్త సాయంతో మృతదేహం తరలింపు!

బెంగళూరులో ‘సూపర్‌ డీలక్స్’ సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. తన ఇంట్లో పని చేసే మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో ఓ వ్యాపారవేత్త అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె.. తన భర్త సాయంతో అతని మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పారేయడం గమనార్హం.

Published : 25 Nov 2022 20:07 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో ‘సూపర్‌ డీలక్స్’ సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. తన ఇంట్లో పని చేసే మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో ఓ వ్యాపారవేత్త అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె.. తన భర్త సాయంతో అతని మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పారేయడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన బాలసుబ్రమణియన్‌(67) వ్యాపారవేత్త. తన ఇంట్లో పని చేసే మహిళతో ఇటీవల ఏకాంతంగా గడుపుతోన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో తనపై ఎక్కడ హత్య కేసు నమోదవుతుందోనని భయపడిన ఆమె.. వెంటనే భర్త, సోదరుడిని పిలిచింది. ముగ్గురు కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి, నిర్మానుష్య ప్రాంతంలో పారేశారు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. మృతుడు ఇటీవలే యాంజియోగ్రామ్‌ చేయించుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు చెప్పారు. ఘటన జరిగిన రోజు తనకు వ్యక్తిగత పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లినట్లు ఆధారాలు దొరికాయని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని