Bus Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనమయ్యారు. మరో 12 మంది గాయపడ్డారు. 

Published : 27 Dec 2023 23:43 IST

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. గుణ నుంచి ఆరోన్‌కి ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు.. ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు సజీవదహనం కాగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని