
TS News: తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతు
శివ్వంపేట: మెదక్ జిల్లాలో తహసీల్దార్‌పై ఓ రైతు డీజిల్ పోశాడు. ఈ ఘటన శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తాళ్లపల్లి తండాలో రైతు మాలోత్ బాలు విద్యుదాఘాతంతో మృతిచెందారు. తహసీల్దార్ భానుప్రకాశ్ సకాలంలో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. ఈ కారణంగానే మాలోత్ బాలుకు బీమా రాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మంగళవారం రైతులంతా మాలోత్ బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోశాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేరుకుని రైతులకు నచ్చజెపుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.