‘క్వారంటైన్‌’ను ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరుతున్నాయి. కాగా.. బ్రెజిల్‌ నుంచి పంజాబ్‌కు వచ్చిన అరుణ్‌శర్మ అనే..

Updated : 23 Mar 2020 01:32 IST

చండీగఢ్‌(పంజాబ్‌): కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరుతున్నాయి. కాగా.. బ్రెజిల్‌ నుంచి పంజాబ్‌కు వచ్చిన అరుణ్‌శర్మ అనే వ్యక్తి క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించాడు. దీంతో సదరు వ్యక్తిపై పంజాబ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారులు గురుదాస్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో సామాజిక దూరాన్ని పాటించకుండా నిబంధనలు విస్మరించినందుకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 188 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. పంజాబ్‌లో ఇప్పటికే మార్చి 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని