పంజాబ్‌లో కూలిన యుద్ధ విమానం‌.. పైలట్‌ సురక్షితం

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌- 27 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. పంజాబ్‌లోని నవాన్‌షహార్‌.....

Updated : 08 May 2020 15:56 IST

చండీగఢ్‌: భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌- 27 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. పంజాబ్‌లోని నవాన్‌షహార్‌ సమీపంలో ఉదయం 10.30గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చౌహారాపూర్‌ గ్రామంలో నిర్మానుష్య ప్రదేశంలో ఈ జెట్‌ కూలిపోవడంతో అక్కడ మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. జలంధర్‌ సమీపంలో  జరుగుతున్న శిక్షణ కార్యక్రమం నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఐఏఎఫ్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఈ ఘటనలో పైలట్‌ను హెలికాఫ్టర్‌ ద్వారా కాపాడినట్టు తెలిపారు. సాంకేతిక లోపం తలెత్తడంతో జెట్‌ను పైలట్‌ అదుపుచేయలేకపోయారనీ..  ఈ మిగ్‌ - 29 కూలిపోవడానికి ముందే పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పైలట్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఐఏఎఫ్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని