గర్భవిచ్ఛిత్తి వికటించి యువతి మృతి

గర్భవిచ్ఛిత్తి వికటించి ఓ యువతి చనిపోయిన సంఘటన శుక్రవారం భద్రాచలంలో చోటుచేసుకుంది. పెళ్లి కాని యువతికి అబార్షన్‌ చేసి ఆమె మృతికి కారణమైన ఆసుపత్రిని జిల్లా అధికారులు సీజ్‌ చేశారు. సంఘటన పూర్తి వివరాలు మృతురాలి

Updated : 20 Aug 2022 06:33 IST

ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న ఆదివాసీ సంఘాల నాయకులు

భద్రాచలం, ములకలపల్లి, న్యూస్‌టుడే: గర్భవిచ్ఛిత్తి వికటించి ఓ యువతి చనిపోయిన సంఘటన శుక్రవారం భద్రాచలంలో చోటుచేసుకుంది. పెళ్లి కాని యువతికి అబార్షన్‌ చేసి ఆమె మృతికి కారణమైన ఆసుపత్రిని జిల్లా అధికారులు సీజ్‌ చేశారు. సంఘటన పూర్తి వివరాలు మృతురాలి బంధువుల కథనం మేరకు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన గిరిజన యువతి(22) డిగ్రీ పూర్తి చేసింది. 17వ తేదీ ఇదే మండలం పకీరుతండాకు చెందిన బూక్యా నంద మరో మహిళతోపాటు ఆమెను తీసుకొని భద్రాచలం వచ్చాడు. అంబేడ్కర్‌ సెంటర్‌లోని శ్రీసురక్షా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. యువతి తన భార్య అని, ఐదు నెలల గర్భిణి అని అక్కడి వైద్యులతో చెప్పాడు. నంద, అతనితోపాటు వచ్చిన మహిళ కోరడంతో గురువారం వైద్యులు ఆమెకు అబార్షన్‌ చేశారు. అనంతరం పరిస్థితి విషమంగా మారింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి బంధువులకు ఫోన్‌ చేసి చెప్పడంతో వారు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉంది. ఈ క్రమంలో శుక్రవారం యవతి చనిపోయింది. ఈమెను ఆసుపత్రికి తీసుకొచ్చిన నంద, ఆమెతోపాటు వచ్చిన మరో మహిళ పరారయ్యారు.

కుటుంబ సభ్యుల ఆందోళన: నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్‌ చేసి గిరిజన యువతి మృతికి కారణమైన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు, గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. నంద అనే వ్యక్తి యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. గర్భవిచ్ఛిత్తి చేసిన ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేశామన్నారు.

ఆసుపత్రి సీజ్‌: అబార్షన్‌ చేసేందుకు ఎటువంటి అనుమతులు లేకున్నా.. పెళ్లికాని యువతికి గర్భవిచ్ఛిత్తి చేసి ఆమె మృతికి కారణమైన శ్రీసురక్ష మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్‌ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు..

నిందితుడు నంద

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని