కూల్‌డ్రింక్‌ అనుకుని పెట్రోల్‌ తాగిన బాలుడు

ఆలయం వద్ద ఆడుతూ కూల్‌డ్రింక్‌ అనుకొని పెట్రోల్‌ తాగిన రెండేళ్ల బాలుడు.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది.

Published : 10 Apr 2024 06:29 IST

చికిత్స పొందుతూ మృతి

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ఆలయం వద్ద ఆడుతూ కూల్‌డ్రింక్‌ అనుకొని పెట్రోల్‌ తాగిన రెండేళ్ల బాలుడు.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్‌ కరిముల్లా, అమ్ము దంపతులకు కరిష్మా, కాలేషా(2) పిల్లలు. కరిముల్లా చికెన్‌ దుకాణంలో, అమ్ములు చేపల దుకాణంలో పనిచేస్తూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. ఈ నెల 7న సాయంత్రం అమ్ములు ఇరుగాళమ్మ ఆలయం వద్ద పనిచేస్తుండగా.. కాలేషా అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ పెట్రోల్‌ బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్‌ అనుకొని తాగాడు. వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయాన్ని గుర్తించిన తల్లి.. బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. బాధిత తల్లిదండ్రులు   చిన్నబజారు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని