1,400 కిలోల బంగారం స్వాధీనం

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీపెరుంబుదూర్‌-కుండ్రత్తూర్‌ రహదారిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది.

Updated : 15 Apr 2024 06:46 IST

తమిళనాడులో ఘటన

శ్రీపెరుంబుదూర్‌, న్యూస్‌టుడే: తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీపెరుంబుదూర్‌-కుండ్రత్తూర్‌ రహదారిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్‌ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1000 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్‌ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులను సంప్రదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని