రాష్ట్ర సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Published : 30 Apr 2024 04:41 IST

చర్ల, దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్‌ పరిధిలోని పెసల్‌పాడు అడవుల్లో మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్డ్‌), బస్తర్‌ ఫైటర్స్‌, 208 కార్ప్స్‌ కోబ్రా బలగాలు సంయుక్తంగా తనిఖీకి వెళ్లాయి. ఈ క్రమంలో ఇరువైపులా ఎదురుకాల్పులు చోటు చేసుకోగా.. ఒక మావోయిస్టు మృతిచెందారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, మావోయిస్టుల సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కూంబింగ్‌ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ తెలిపారు. మృతిచెందిన మావోయిస్టు వివరాలను గుర్తించాల్సి ఉందన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ‘ఘర్‌వాపసీ’ పిలుపు మేరకు భైరంగఢ్‌ ఏరియా కమిటీకి చెందిన 23 మంది మావోయిస్టులు  సోమవారం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్‌రాయ్‌ ఎదుట లొంగిపోయారు. వీరంతా వివిధ విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నవారని, ప్రభుత్వపరంగా వారికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని