Fake Currency: రూ.12 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదివారం తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.50 లక్షల

Updated : 01 Nov 2021 06:54 IST

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదివారం తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.50 లక్షల అసలు నోట్లు, రూ.12 లక్షల నకిలీ నోట్లు, నాలుగు చరవాణులు, మూడు ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బుట్టాయగూడెం శివారులో శనివారం రాత్రి నకిలీ నోట్లు మార్చుకుంటుండగా పోలీసులు దాడి చేసి జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చంద్రశేఖర్‌, శ్రీను, రమేష్‌రెడ్డి, మధు, పెనుగొండకు చెందిన నాగరాజు, తూర్పుగోదావరి జిల్లా తుని మండలం నక్కవరానికి చెందిన సురేష్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని