TS News:ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజరుకు ఏడేళ్ల జైలుశిక్ష

బ్యాంకుకు రూ.4.03 కోట్ల నష్టం రావడానికి కారకుడైన ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ సింగ్‌కు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ అదనపు సీబీఐ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం

Updated : 31 Dec 2021 06:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకుకు రూ.4.03 కోట్ల నష్టం రావడానికి కారకుడైన ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ సింగ్‌కు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ అదనపు సీబీఐ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ బ్రాంచ్‌ అప్పటి మేనేజర్‌ అయిన ప్రవీణ్‌ సింగ్‌పై 2010 ఏప్రిల్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. అతను స్పెషల్‌ టర్మ్‌ డిపాజిట్‌ రసీదులను కాలపరిమితి ముగిసినట్లు చూపి.. రూ.4.03 కోట్లను తన సొంత ఖాతాలోకి, నకిలీ పేర్లతో మళ్లించి స్వాహా చేశాడు. దీనిపై 2011లో సీబీఐ దర్యాప్తు చేసి అభియోగ పత్రం దాఖలు చేసింది. నేరం రుజువుకావడంతో ప్రవీణ్‌ సింగ్‌కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని