
నాటు బాంబు పేలుడుతో తెగిన మహిళ చేతివేళ్లు
పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా పత్తికొండలో శనివారం నాటుబాంబు పేలి ఓ మహిళా రైతు చేతివేళ్లు తెగాయి. ఎస్సై భూపాలుడు తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండ శివారులోని అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న పొలంలో హయాద్‌బీ అనే మహిళ పత్తి కోత చేపట్టారు. ఓ ప్లాస్టిక్ కవర్‌లో నిమ్మకాయ పరిమాణంలో ఉన్న రెండింటిని గుర్తించిన హయాద్‌బీ.. వాటికి చుట్టి ఉన్న దారాన్ని విప్పి చూస్తుండగా చేతిలోనే పేలిపోయింది. దీంతో ఆమె చేతివేళ్లు తెగిపోయాయి. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదే ప్రాంతంలో పేలకుండా ఉన్న మరో బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అడవి జంతువుల కోసం ఉంచినవిగా భావిస్తున్నట్లు ఎస్సై భూపాలుడు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.