Crime News: గంజాయి తెలివితేటలు.. స్మగ్లర్లు ఎక్కడ దాచి తరలిస్తూ పట్టుబడ్డారంటే?

అక్రమ సంపాదనకు అలవాటుపడిన గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాల్లో సరకును తరలిస్తుండగా వరంగల్‌ జిల్లా రాయపర్తి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Published : 19 Apr 2022 09:25 IST

లారీ ట్రక్కు కింద ప్రత్యేక అర
వరంగల్‌ జిల్లాలో దొరికిన స్మగ్లర్లు

రాయపర్తి, న్యూస్‌టుడే: అక్రమ సంపాదనకు అలవాటుపడిన గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాల్లో సరకును తరలిస్తుండగా వరంగల్‌ జిల్లా రాయపర్తి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జనగామ వెస్ట్‌జోన్‌ డీసీపీ సీతారాం కథనం ప్రకారం.. ‘‘సోమవారం రాయపర్తి ఠాణా ఎదురుగా ఎస్సై బండారి రాజు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. వరంగల్‌ వైపు కారులో వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనకాపల్లి జిల్లా గోలుగొండకు చెందిన పోలిరెడ్డి గంగరాజు, నర్సీపట్నం మండలం గబ్బడకు చెందిన రుతాల నానాజీలను ప్రశ్నించారు. వారి కదలికలు అనుమానంగా ఉండటంతో కారులో తనిఖీ చేయగా 20 కిలోల గంజాయి లభించింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా..వరంగల్‌ వైపు వస్తున్న ఏపీ27టీయూ1899 నంబరు లారీలో గంజాయి ఉన్నట్లు తెలిపారు. అప్పటికే వారు ..తాము దొరికిపోయినట్టు లారీ డ్రైవర్‌ అప్పికొండ శివ, క్లీనర్‌ అడపరెడ్డి కిషోర్‌లకు సమాచారమివ్వడంతో వారు వంద మీటర్ల దూరంలో వాహనాన్ని వదిలి పారిపోయారు. లారీనితనిఖీ చేయగా 480 కిలోల గంజాయి లభించింది. గంగరాజు, నానాజీలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించాం. నిందితులు లారీ ట్రక్కు కింది భాగంలో సుమారు 500 కిలోల గంజాయిని రవాణా చేసేందుకు అనువుగా అర నిర్మించారు’’ అని డీసీపీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని