రక్షణ గోడలు లేని డ్రెయిన్‌లో పడి ఒకరి గల్లంతు

అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి డ్రెయిన్‌లో పడి గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన కలాంబేగ్‌(40)

Published : 06 Aug 2022 04:24 IST

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి డ్రెయిన్‌లో పడి గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన కలాంబేగ్‌(40) శుక్రవారం సాయంత్రం స్థానిక పెట్రోలు బంకు కూడలి నుంచి ఇంటికి బయలుదేరారు. తెనాలి డ్రెయిన్‌ వంతెన మీదకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ నుంచి తప్పుకొనేందుకు వారధికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కడ్డీలను పట్టుకున్నాడు. ఈ క్రమంలో అవి వంగిపోవడంతో అదుపుతప్పి డ్రెయిన్‌లో పడిపోయాడు. వర్షాలకు డ్రెయిన్‌ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని