అత్యాచారమని ఫిర్యాదు చేస్తే.. తగాదా కేసు పెడతారా?

తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేవలం చిన్నపాటి తగాదా కింద కేసు నమోదు చేసి అన్యాయం చేశారని బాధితురాలు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

Published : 09 Aug 2022 04:25 IST

ఎస్పీ ఎదుట బాధితురాలి ఆవేదన

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేవలం చిన్నపాటి తగాదా కింద కేసు నమోదు చేసి అన్యాయం చేశారని బాధితురాలు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనలో ఆమె ఫిర్యాదుచేశారు. బాధితురాలి కథనం ప్రకారం.. హిందూపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటివద్ద జరిగిన చిన్న గొడవ విషయమై సోమశేఖర్‌, అఖిల్‌, అక్కులప్ప అనే ముగ్గురు వ్యక్తులు కక్ష పెంచుకున్నారు. మే 23న ఎవరూలేని సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడగా, మరునాడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తగాదా కింద కేసు నమోదుచేసి ఇంటికి పంపారు. ఆనక మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ భౌతిక దాడికి దిగడమేకాక, మరోసారి అత్యాచారం చేశారు. వారికి భయపడి బెంగళూరుకు మకాం మార్చగా, ఫోన్‌ ద్వారా వేధిస్తున్నారు అంటూ ఎస్పీ దృష్టికి తెచ్చారు. తనకు న్యాయం చేయని పక్షంలో ఇక్కడే చనిపోతానంటూ విలపించారు. అయితే, ఈ కేసులో నిందితులను కాపాడేందుకు అదే మండలంలోని ఓ పంచాయతీ సర్పంచి భర్త, వైకాపా నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక వ్యాపారంలో తనకు సహకరిస్తున్నందున నిందితులపై తక్కువ తీవ్రత గల సెక్షన్లతో కేసులు నమోదు చేయించారన్న అభియోగాలు విన్పిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని