ప్రియుడితో కలిసి కుట్ర.. అత్తామామల నగ్న వీడియోలు తీసిన కోడలు

ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన ఓ మహిళ తన సొంత అత్తామామల నగ్న వీడియోలను తీసిన దారుణ ఉదంతమిది. దిల్లీలోని లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి (ఆభరణాల వ్యాపారి) తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.

Updated : 20 Sep 2022 07:01 IST

ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన ఓ మహిళ తన సొంత అత్తామామల నగ్న వీడియోలను తీసిన దారుణ ఉదంతమిది. దిల్లీలోని లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి (ఆభరణాల వ్యాపారి) తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో.. వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు. బండారం బయటపడటంతో.. ఇంట్లో ఉన్న రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకొని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తకు ఫోన్‌ చేసిన భార్య.. బెదిరింపులకు దిగింది. తమ ఇంట్లో అత్తమామల (భర్త తల్లిదండ్రులు) గదిలో రహస్య కెమెరాలు పెట్టి.. వారి నగ్న వీడియోలు తీసిన విషయాన్ని బయటపెట్టింది. తనపై కేసును వెనక్కి తీసుకోకపోతే.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ భర్తను బెదిరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని