రైలు ఆగిందని సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం

రైలు ఆగడంతో కిటికీలోంచి సెల్‌ఫోన్‌ కొట్టేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగకు... ప్రయాణికులు మూడు చెరువుల నీళ్లు తాగించారు! బిహార్‌లోని భాగల్‌పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది.

Updated : 30 Sep 2022 06:40 IST

ప్రయాణికులకు చిక్కడంతో ఐదు కిలోమీటర్లు వేలాడుతూ ప్రయాణం!

భాగల్‌పుర్‌ (బిహార్‌): రైలు ఆగడంతో కిటికీలోంచి సెల్‌ఫోన్‌ కొట్టేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగకు... ప్రయాణికులు మూడు చెరువుల నీళ్లు తాగించారు! బిహార్‌లోని భాగల్‌పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఇక్కడి మమల్ఖా రైల్వేస్టేషన్‌లో బుధవారం ఓ రైలు నిలవగా... ఓ యువకుడు రైలు కిటికీలో చేయిపెట్టి, ప్రయాణికుడి చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కున్నాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా... పక్కన తలుపు వద్ద ఉన్న కొందరు ప్రయాణికులు అతడి చేయిని పట్టుకున్నారు. ఇంతలోనే రైలు కదిలింది. దీంతో తనను విడిచిపెట్టాలని అతడు వేడుకున్నా, వారు వినలేదు. ఈ క్రమంలోనే రైలు 80-100 కిలోమీటర్ల వేగం అందుకుంది. కొద్దిసేపటి తర్వాత ప్రయాణికులు అతడిని బోగీలోకి ఈడ్చి కొట్టారు. ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కహల్‌గావ్‌ స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ జవాన్లకు నిందితుడిని అప్పగించినట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారినా, అధికారులు ధ్రువీకరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని