రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Published : 25 Nov 2022 05:10 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్‌ ఒకటో ఠాణా ఎస్సై రహీం పాషా తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సాయినగర్‌కు చెందిన శ్రీరాముల శ్రవణ్‌ (33) కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు. అవసరాల నిమిత్తం రుణయాప్‌ల ద్వారా రూ.3 లక్షల అప్పు తీసుకున్నారు. అందులో కొంత స్నేహితులకు అప్పుగా ఇచ్చారు. వారు ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో రుణం చెల్లించలేకపోయారు. రుణం చెల్లించాలంటూ యాప్‌ సంస్థల నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువవడంతో అతను ఈనెల 23న కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియం ఆవరణలో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు అతణ్ని చికిత్స నిమిత్తం తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని