తల్లి ఆస్తి పంపకంలో విభేదాలు

తల్లి సంపాదించిన సొమ్మును పంచుకునే క్రమంలో అన్నదమ్ముల మధ్య తగాదా.. తమ్ముడు, మధ్యవర్తి ఆత్మహత్యకు దారితీసింది.

Published : 03 Dec 2022 04:39 IST

తమ్ముడు, మధ్యవర్తిపై పోలీసులకు అన్న ఫిర్యాదు
భయంతో ప్రాణాలు తీసుకున్న నిందితులు

వంగూరు, న్యూస్‌టుడే: తల్లి సంపాదించిన సొమ్మును పంచుకునే క్రమంలో అన్నదమ్ముల మధ్య తగాదా.. తమ్ముడు, మధ్యవర్తి ఆత్మహత్యకు దారితీసింది. సంఘటన శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.. ఎస్సై కురుమూర్తి కథనం ప్రకారం.. వంగూర్‌ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన ముత్తమ్మకు రామయ్య(55), మల్లయ్య(50) కుమారులు. ముత్తమ్మ మూడు నెలల కిందట మృతిచెందగా ఆమె వద్దనున్న 3 తులాల బంగారం, రూ.3లక్షల నగదును బంధువైన మధ్యవర్తి అంజయ్య(55) వద్ద పెట్టారు. సోదరులిద్దరూ బంగారం, నగదు పంచుకునే విషయంలో విభేదించారు. ఇంటికి పెద్దవాడినని, తల్లికి ఎక్కువ సేవలు చేశానని.. తనకు ఎక్కువ భాగం ఇవ్వాల్సిందేనని రామయ్య పట్టుబట్టాడు. తమ్ముడితోపాటు మధ్యవర్తిపై ఈనెల 1న ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పెద్దమనుషులు, గ్రామస్థులు నిలదీసేసరికి మల్లయ్య మనస్తాపానికి గురై గురువారం రాత్రి పురుగుమందు తాగాడు. కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించగా శుక్రవారం మృతిచెందాడు. మల్లయ్య చనిపోయిన విషయం తెలియగానే మధ్యవర్తి అంజయ్య భయాందోళనకు గురై తానూ పురుగుమందు తాగాడు. చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా తుక్కుగూడ శివారులో కన్నుమూశాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుల మేరకు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు