Mancherial: హృదయ విదారకం.. భార్య మృతదేహాన్ని తరలిస్తుండగా భర్త మృతి

మంచిర్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుంది. పక్కింటి వాళ్ల గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Updated : 16 Jul 2023 13:39 IST

లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుంది. పక్కింటి వాళ్ల గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలిస్తుండగా.. భర్త లారీ కింద పడి మృతి చెందారు. జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారంలో ఈ ఘటన జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ రావు (31), శరణ్య (29) దంపతులు. పొరుగింటి వారితో జరిగిన గొడవతో మనస్తాపం చెంది ఈనెల 13న శరణ్య పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ శరణ్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆదివారం మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో.. లక్సెట్టిపేటలోని కరీంనగర్‌ చౌరస్తా వద్ద మల్లికార్జున్‌ రావు వస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్‌ అక్కడికక్కడే మృతిచెందారు. దంపతుల మృతితో వారి ఇద్దరి పిల్లలు అనాథలు మారారని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని