crime: ఇకపై అలాంటి వీడియోలు చేయను 

రైల్వే ప్లాట్‌ఫాం మీద నిల్చొని రైలు సమీపించగానే లైటర్‌తో సిగరెట్‌ వెలిగించి స్టైల్‌గా నిల్చొనే వీడియోతోపాటు.. మరో వీడియోలో రైల్వే పట్టాలమీద కూర్చొని పొగ తాగుతూ కనిపిస్తాడు. ఈరెండూ వీడియోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేయగానే. . రైల్వే నియమనిబంధనలను అతిక్రమించాడంటూ సెంట్రల్‌ రైల్వే ప్రొటెక్టివ్‌ ఫోర్స్‌ బృందాలకు ఫిర్యాదులందాయి. వెంటనే రంగంలోకి దిగిన ఐపీఎఫ్‌ బద్లాపుర్ బృందం..

Published : 29 Aug 2021 01:24 IST

ఇన్‌స్టాగ్రామర్‌ ఆదర్శ్‌ శుక్లా అరెస్ట్‌

ముంబయి: సామాజిక మాధ్యమాల్లో సందేశాత్మక వీడియోలు రూపొందిస్తే సరేసరి. అలా కాకుండా.. రూల్స్‌కి విరుద్ధంగా చేస్తే ఇలాంటి గతే పడుతుంది. విషయానికొస్తే.. అతడి పేరు ఆదర్శ్‌ శుక్లా. ఇన్‌స్టాలో 6.3 లక్షల ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌గా పేరొందాడు. తాజాగా అతడు రూపొందించిన వీడియో.. అరెస్టైయ్యేలా చేసింది. రైల్వే ప్లాట్‌ఫాం మీద నిల్చొని రైలు సమీపించగానే లైటర్‌తో సిగరెట్‌ వెలిగించి స్టైల్‌గా నిల్చొనే వీడియోతోపాటు.. మరో వీడియోలో రైల్వే పట్టాలమీద కూర్చొని పొగ తాగుతూ కనిపిస్తాడు. ఈరెండూ వీడియోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేయగానే. . రైల్వే నియమనిబంధనలను అతిక్రమించాడంటూ సెంట్రల్‌ రైల్వే ప్రొటెక్టివ్‌ ఫోర్స్‌ బృందాలకు ఫిర్యాదులందాయి. వెంటనే రంగంలోకి దిగిన ఐపీఎఫ్‌ బద్లాపుర్ బృందం.. అతడి బీఎండబ్ల్యూ కారు నెంబరు ఆధారంగా ట్రాక్‌ చేసి పట్టుకున్నారు. ఈసారి సెంట్రల్‌ రైల్వే ఆదర్శ్‌తో మరో వీడియో రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇందులో ఆదర్శ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వీడియో తీసినందుకు క్షమించండి. ఆనందం కోసం రైల్వే స్టైషన్‌లో కానీ రైలులో ఇలాంటి అభ్యంతర వీడియో రూపొందించకండి’’ అంటూ వేడుకున్నాడు.  

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని