Crime News: పంచలోహ విగ్రహాల విక్రయానికి యత్నం.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు

పంచలోహ విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను గుంటూరు అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4కిలోల బరువుతో

Published : 19 Oct 2021 01:51 IST

గుంటూరు‌: పంచలోహ విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను గుంటూరు అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4కిలోల బరువుతో.. రూ.10 లక్షలు విలువైన శివపార్వతుల పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డీఎస్పీ సుప్రజ మీడియాకు వివరించారు.

ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కమ్మవారిపాలెంకు చెందిన రైతు సుందరరావు.. గతేడాది నవంబరులో తన పొలం దున్నుతుండగా శివ పార్వతుల పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అవి బంగారు విగ్రహాలుగా భావించిన సుందరరావు, ఎవరికి చెప్పకుండా అతని ఇంట్లోనే దాచుకున్నాడు. ఇటీవల సుందరరావుకు ప్రమాదం జరగగా డబ్బులు అవసరమై తన అన్నయ్య కుమారుడైన రవిని ఇంటికి పిలిచి పంచలోహ విగ్రహాల విషయాన్ని విరించాడు. వీరిద్దరితో పాటు గుంటూరుకు చెందిన మరో నలుగురు వ్యక్తులు విగ్రహాలు విక్రయించే క్రమంలో ఇవాళ గుంటూరు కొరిటెపాడు సెంటర్‌లో పట్టుబడ్డారు. పురాతన, విలువైన వస్తువులు ఏవైనా దొరికితే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం అందించాలని.. అలా కాకుండా ఎవరైనా స్వప్రయోజనాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని