logo
Published : 02/12/2021 03:08 IST

‘డయల్‌ యువర్‌ ఎస్పీ’కి ఫిర్యాదుల వెల్లువ


ఫిర్యాదిదారులతో మాట్లాడుతున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రౌడీషీటర్లు కత్తులతో బెదిరిస్తూ రోడ్లపై తిరుగుతుంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారంటూ రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

●బాపట్లకు చెందిన ఒక యువకుడు మాట్లాడుతూ తన స్నేహితుడిని ఒక రౌడీషీటర్‌, అతని సోదరుడు కలిసి కర్లపాలెం వద్ద అడ్డుకొని కత్తులు చూపి పొడుస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశాడు. వారం క్రితం దాడి చేశారని వాపోయాడు. రౌడీషీటర్‌ రెండు హత్య కేసుల్లో నిందితుడని, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నామని.. రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. వెంటనే ఎస్పీ అక్కడి పోలీసులతో మాట్లాడారు. రౌడీషీటర్‌కు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారా? క్రమం తప్పకుండా చేస్తే రోడ్లపై కత్తులతో తిరుగుతూ ప్రజలను బెదిరిస్తుంటే మీరేం చేస్తున్నారంటూ మందలించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

●కర్లపాలెంకు చెందిన మహిళ మాట్లాడుతూ అధిక కట్నం కోసం భర్త, అత్త తనను ఇంటి నుంచి గెంటేశారని, 2013లో వారిపై 498 కేసు పెట్టినట్లు తెలిపారు. తనకు నెలవారీ కుటుంబ పోషణ ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎనిమిదేళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. దర్యాప్తు చేసి ఆమెకు న్యాయం చేయాలని అక్కడి పోలీసులను ఆదేశించారు.

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని