logo

Adilabad: నందిగ్రాం రైల్లో భారీ చోరీ

ముంబయి నుంచి ఆదిలాబాద్‌ వచ్చే నందిగ్రాం రైల్లో భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా తెలిసింది. ఆదిలాబాద్‌కు చెందిన వ్యాపారి కుటుంబం ప్రయాణిస్తున్న బోగీలో నుంచి వారికి చెందిన రెండు పర్సులతో పాటు అందులోని దాదాపు రూ.36 లక్షల విలువైన నగలు, నగదును దుండగులు తస్కరించారు.

Updated : 08 Feb 2024 08:05 IST

నాందేడ్‌ రైల్వే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన వ్యాపారి జగదీశ్‌ అగర్వాల్‌

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : ముంబయి నుంచి ఆదిలాబాద్‌ వచ్చే నందిగ్రాం రైల్లో భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా తెలిసింది. ఆదిలాబాద్‌కు చెందిన వ్యాపారి కుటుంబం ప్రయాణిస్తున్న బోగీలో నుంచి వారికి చెందిన రెండు పర్సులతో పాటు అందులోని దాదాపు రూ.36 లక్షల విలువైన నగలు, నగదును దుండగులు తస్కరించారు. బాధితులు నాందేడ్‌లోని రైల్వే పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన సురేష్‌ అగర్వాల్‌, జగదీశ్‌ అగర్వాల్‌ కుటుంబాలు నాసిక్‌లో జరిగిన బంధువుల వివాహానికి ఈ నెల 4న వెళ్లారు. తిరిగి 5న రాత్రి 8 గంటల ప్రాంతంలో నందిగ్రాం రైలులో ఏసీ బోగీలో ఆదిలాబాద్‌కు బయలుదేరారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నాందేడ్‌కు రైలు చేరుకున్నప్పుడు వారు తమ బ్యాగులను పరిశీలించుకోగా వారికి చెందిన రెండు పర్సులు, రెండు చరవాణులు కనిపించలేదు.  చోరీకి గురైనట్లు గమనించామని బాధితులు వాపోయారు. పర్సుల్లో రూ.30లక్షలకు పైగా విలువ గల వజ్రాల నగలు, రూ.5.70 లక్షల నగదు ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే రైలులో సాధారణంగా ఏసీ బోగీలు లోపలి నుంచి గడియ పెట్టుకొని ఉంటారు. మరి చోరీ ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. చోరీ విషయమై జగదీశ్‌ అగర్వాల్‌ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని