logo

రెండోరోజు కాంగ్రెస్‌ అభ్యర్థి ఒక్కరే!

లోక్‌సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు.

Published : 20 Apr 2024 02:41 IST

కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఆర్వోకు నామపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, చిత్రంలో కంది శ్రీనివాస్‌రెడ్డి, గజేందర్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : లోక్‌సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. ఆయన వెంట ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జులు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్‌, నాయకులు సయ్యద్‌ కరీం, శ్రీలేఖ ఉన్నారు. ఇప్పటి వరకు దాఖలైన నామపత్రాల సంఖ్య మూడుకు చేరుకుంది.

పేదింటి బిడ్డను ఆదరించండి : ఎమ్మెల్యే

ఆత్రం సుగుణ పేదింటి బిడ్డని, ఆమెను ఆదరించి పార్లమెంటుకు పంపాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రజలను కోరారు. నామపత్రం దాఖలుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, పోరాటాల్లో పాల్గొన్న మహిళగా గుర్తింపు ఉన్న సుగుణకు కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం కల్పించిందని గుర్తుచేశారు. అయిదు న్యాయసూత్రాలు, ఆరు గ్యారెంటీల అమలు లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానం కాంగ్రెస్‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని