logo

జేఈఈ మెయిన్స్‌లో గిరిజన విద్యార్థిని ప్రతిభ

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్‌ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు.

Published : 26 Apr 2024 03:00 IST

 

మేఘన

ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే : జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్‌ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. స్థానిక రైతు జైవంత్‌రావు, హలిమాబాయిల కుమార్తె దేశస్థాయిలో 67వ ర్యాంకు సాధించడంతో స్థానికులు ఆమెను అభినందించారు. ఆమె ర్యాంకు సాధించడం పట్ల టీటీఎఫ్‌ జిల్లా నాయకుడు రాఠోడ్‌ గణేశ్‌ హర్షం వ్యక్తం చేశారు.

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఆదిలాబాద్‌ పట్టణం గ్రీన్‌సిటీకి చెందిన విద్యార్థి రామగిరి కార్తిక్‌ ఓబీసీ విభాగంలో తొలి ప్రయత్నంలోనే 99.4397213 పర్సంటైల్‌ సాధించి జాతీయస్థాయిలో 1,997 ర్యాంకుతో సత్తాచాటాడు. తండ్రి రామగిరి శివకుమార్‌ తెలంగాణ రాష్ట్ర టీచర్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. తల్లి గీతారాణి గృహిణి. తమ కుమారుడి ఇంజినీరింగ్‌ పూర్తికాగానే సివిల్స్‌ చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని