logo

ఆడబిడ్డగా ఆదరించండి

ఆడబిడ్డగా మీ చెంతకు వచ్చా..కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను ఆదరించండి అయిదేళ్లు అండగా ఉంటా అంటూ ఆదిలాబాద్‌ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

Published : 01 May 2024 02:33 IST

 కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ

స్వర్ణలో కొంగు చాచి ఓట్లు ఆభ్యర్థిస్తున్న ఆత్రం సుగుణ, చిత్రంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: ఆడబిడ్డగా మీ చెంతకు వచ్చా..కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను ఆదరించండి అయిదేళ్లు అండగా ఉంటా అంటూ ఆదిలాబాద్‌ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. మంగళవారం సారంగాపూర్‌ మండలం ధని, సాయినగర్‌, బోరిగాం, జామ్‌, స్వర్ణ, చించోలి(ఎం) గ్రామాల్లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జరిగే ప్రాంతాలను సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఏ పార్టీ ఇంత వరకు చేయలేని ఆలోచనతో కాంగ్రెస్‌ పార్టీ ముందడుగువేసి మహిళనైనా తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు.  పదేళ్ల చొప్పున భారాస, భాజపాలకు మీరు అవకాశం కల్పించారు. ఒకసారి కాంగ్రెస్‌ను ఆదరించండి.. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  ఎంపీపీ ఆడే సవితబాయి, జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ కన్వీనర్‌ బొల్లోజి నర్సయ్య, సీనియర్‌ నాయకులు అల్లూరి మల్లారెడ్డి, రాజ్‌మహ్మద్‌, అబ్దుల్‌ ఆది, మారుతి, దశరథ రాజేశ్వర్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

నర్సాపూర్‌(జి): మండల కేంద్రంలో మంగళవారం ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సమక్షంలో భారాస నుంచి పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

దిలావర్‌పూర్‌: ప్రజా సమస్యలపై పోరాటమే తన అజెండా అని ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం రాత్రి గుండంపల్లి, లోలం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.   ఒక్కసారి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. నాయకులు విద్యాసాగర్‌ రెడ్డి, కె.దేవేందర్‌రెడ్డి, అర్గుల రమణ, కోడె విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

మామడ: ఇతర పార్టీలన్నీ ఎన్నికలప్పుడే పేదలపై ప్రేమ కనబరుస్తాయని ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం మండలంలోని వాస్తాపూర్‌, గోండుగూడ, అరెపల్లి గ్రామాల్లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.   రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి హామీని నెరవేరుస్తుందని భరోసానిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని