logo

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు

వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించినా, సమయపాలన పాటించకున్నా కఠిన చర్యలు తప్పవని అదనపు డీఎంహెచ్ఓ(కుష్టు, ఎయిడ్స్ నియంత్రణ) డాక్టర్ గజానన్ హెచ్చరించారు.

Published : 02 May 2024 19:14 IST

ఎదులాపురం: వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించినా, సమయపాలన పాటించకున్నా కఠిన చర్యలు తప్పవని అదనపు డీఎంహెచ్ఓ(కుష్టు, ఎయిడ్స్ నియంత్రణ) డాక్టర్ గజానన్ హెచ్చరించారు. రిమ్స్ లోని ఏఆర్టి కేంద్రం, కుష్టు వార్డును ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని వస్తున్న ఫిర్యాదుల మేరకు ఆ కేంద్రాలను తనిఖీ చేస్తూ రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ పట్ల వారికి పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఆ శాఖ అధికారులు మధుసూదన్, అనిల్ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని