logo

క్రీడ సామాగ్రి అందజేత

ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో భాగంగా గురువారం క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేశారు.

Published : 02 May 2024 19:43 IST

అదిలాబాద్ క్రీడాభిభాగం: ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో భాగంగా గురువారం క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు నిర్వాహకులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల రోజులపాటు ఉచితంగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, తీవ్రమైన ఎండల దృష్ట్యా శిబిరాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని