logo

రాజ్యాంగం మార్చే ప్రసక్తే లేదు

భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వదంతులు ప్రజలు నమ్మొద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు మదన్‌సింగ్‌ రాఠోడ్‌ తేల్చిచెప్పారు.

Published : 05 May 2024 02:48 IST

 మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు మదన్‌సింగ్‌ రాఠోడ్‌, చిత్రంలో ఎమ్మెల్యే గోవర్ధన్‌ వర్మ(రాజస్థాన్‌)

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వదంతులు ప్రజలు నమ్మొద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు మదన్‌సింగ్‌ రాఠోడ్‌ తేల్చిచెప్పారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల నాయకులు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌ ప్రవాసీగా ఇక్కడకు వచ్చిన ఆయన రాజస్థాన్‌ ఎమ్మెల్యే గోవర్ధన్‌ వర్మతో కలిసి ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. హోంమంత్రి అమిత్‌షా పేరిట ఫేక్‌ వీడియో ప్రచారం చేసిన వారిపై ఇప్పటికే కేసు నమోదైందన్నారు.  

సిట్టింగ్‌ ఎంపీతో సంప్రదింపులు

 ప్రచారానికి దూరంగా ఉంటున్న సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడామని, పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేస్తానని, ప్రచారంలోనూ పాల్గొంటానని చెప్పారని రాజ్యసభ సభ్యులు పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ సోయంకు భాజపా టికెట్‌ నిరాకరించడంపై సానుభూతి వ్యక్తం చేసిన వైనాన్ని మీడియా ప్రస్తావించగా.. బాపురావు భాజపాలోనే ఉంటారని, భవిష్యత్తులో ఆయనకు మంచి పదవి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు ఆదినాథ్‌, దినేష్‌ మటోలియా, లాలామున్నా, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని