logo

గిరి రైతులకు అన్నివిధాలా ప్రోత్సాహం

గిరిజన రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించి ఆర్థికంగా ఎదగాలని చెందాలని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మారేడుమిల్లిలోని గ్రామ సచివాలయం వద్ద వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 136 మంది గిరిజన రైతులకు 90 శాతం

Published : 03 Jul 2022 02:29 IST

రైతులకు స్ప్రేయర్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: గిరిజన రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించి ఆర్థికంగా ఎదగాలని చెందాలని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మారేడుమిల్లిలోని గ్రామ సచివాలయం వద్ద వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 136 మంది గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన రైతులు లాభదాయక పంటలు సాగు చేయాలన్నారు. గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. అనంతరం మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతు పనులకు వాలమూరు వద్ద ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.2.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. జలతరంగిణి జలపాతం నుంచి సుమారు నాలుగున్నర కిలోమీటర్ల రహదారికి  మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మారేడుమిల్లి ఎంపీపీ సార్ల లలితకుమారి, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, ఎంపీటీసీ సభ్యుడు కొరగాని సువర్ణరాజు, సర్పంచులు కొండా జాకబ్‌, కారం లక్ష్మి, బట్టా లచ్చిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి వై.సత్యనారాయణ, ఎంపీడీవో వివేక్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని