logo

పారిశుద్ధ్యం మెరుగుపై ప్రత్యేక దృష్టి

కార్యదర్శులందరూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు ఆదేశించారు. మోతుగూడెం పంచాయతీని  సోమవారం సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు.

Published : 29 Mar 2023 02:22 IST

మోతుగూడెం సచివాలయలో రికార్డులు పరిశీలిస్తున్న డీపీఓ కొండలరావు

మోతుగూడెం, న్యూస్‌టుడే: కార్యదర్శులందరూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు ఆదేశించారు. మోతుగూడెం పంచాయతీని  సోమవారం సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. పంచాయతీ ఆదాయ వనరులను, గ్రామ సమస్యలను కార్యదర్శి రవినాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. మంచినీటి ట్యాంకులు, బావుల్లో పదిహేను రోజులకు ఒకసారి క్లోరినేషన్‌ చేయాలని సూచించారు. సర్పంచి సీత, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ఎటపాక: ఎటపాక మండల పరిషత్తు కార్యాలయాన్ని, గ్రామ సచివాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పరిశీలించారు. అనంతరం మండల పరిషత్తు సమావేశపు హాలులో 13 గ్రామాల సచివాలయ డిజిటల్‌, సంక్షేమ సహాయకులతో సమావేశం నిర్వహించారు. సచివాలయాల పనితీరు మెరుగుపడాలన్నారు. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇంటికే చేరేలా పని చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిత్యం పరిశీలించాలని సూచించారు. అనంతరం చోడవరం చెత్తసేకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీడీఓ విఠల్‌పాల్‌, ఈఓపీఆర్‌డీ చిచ్చడి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని