logo

అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తోందని ఎమ్మెల్యే  ధనలక్ష్మి అన్నారు.

Published : 29 Mar 2023 02:22 IST

మహిళా సంఘాలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

గంగవరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తోందని ఎమ్మెల్యే  ధనలక్ష్మి అన్నారు. గంగవరం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో మంగళవారం ఆసరా కార్యక్రమంలో పాల్గొని మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. మండలంలో రూ. 1.03 కోట్ల నగదు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామన్నారు.  అనంతరం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు గొల్లపల్లి బేబిరత్నం, సర్పంచి కలుముల అక్కమ్మ, తహసీల్దార్‌ శ్రీమన్నారాయణ, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ యెజ్జు వెంకటేశ్వరరావు, కోఆప్షన్‌ సభ్యులు కల్లె ప్రభాకరరావు పాల్గొన్నారు.

అడ్డతీగల: స్వయం ఉపాధి పొందే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని  ఎమ్మెల్యే  ధనలక్ష్మి అన్నారు. అడ్డతీగల మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో ఏర్పాటైన ఆసరా పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ మండలంలో రూ. 2.18 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వయం సహాయక సంఘ మహిళలకు చెక్కు అందజేశారు. ఎంపీపీ రాఘవ, జడ్పీటీసీ సభ్యుడు వీర్రాజు, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని