logo

రీ సర్వే వేగవంతం చేయండి

ఏజెన్సీలో వైఎస్సార్‌ భూ హక్కు-భూ రక్ష కార్యక్రమం ద్వారా రీ సర్వేను వేగవంతంగా చేయాలని సర్వే శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు పి.కె.జయకుమారి అధికారులను ఆదేశించారు.

Published : 28 May 2023 01:54 IST

సమీక్షిస్తున్న సర్వే ప్రాంతీయ ఉప సంచాలకులు జయకుమారి

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీలో వైఎస్సార్‌ భూ హక్కు-భూ రక్ష కార్యక్రమం ద్వారా రీ సర్వేను వేగవంతంగా చేయాలని సర్వే శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు పి.కె.జయకుమారి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశమందిరంలో శనివారం ఏడు మండలాల సర్వేయర్లు, సచివాలయ సర్వేయర్లతో జయకుమారి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల దస్త్రాలను పక్కాగా పరిశీలించి రైతులకు నష్టం జరగకుండా రీ సర్వే చేయాలన్నారు. ప్రతి మండలంలోనూ సర్వేయర్లకు లక్ష్యం ప్రకారం పనులు అప్పగిస్తామన్నారు.  గ్రామసభ నిర్వహించి సర్వే ప్రారంభించాలన్నారు. మండల సర్వేయర్లు ఎప్పటికప్పుడు సర్వే పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షలో సర్వే ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సీహెచ్‌వీఎస్‌ఎన్‌ కుమార్‌, జిల్లా సర్వే అండ్‌ భూరికార్డుల అధికారి మోహనరావు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే కె.దేవేంద్రుడు, డిప్యూటీ సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్‌, నాగభూషణం పాల్గొన్నారు.

కొయ్యూరు, న్యూస్‌టుడే: భూముల రీసర్వే పనులను సత్వరమే పూర్తిచేయాలని జేసీ శివ శ్రీనివాస్‌ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. శనివారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో భూముల రీసర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డౌనూరు, మూలపేట, పెదమాకవరం, బూదరాళ్ల పంచాయతీల్లో జరుగుతున్న సర్వే ప్రగతిని రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా సర్వే చేపట్టాలన్నారు. స్థానికులతో మాట్లాడి ఎక్కడా సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. తహసీల్దార్‌ తిరుమలరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని