శాస్త్రోక్తంగా సీతారాముల విగ్రహప్రతిష్ఠ
సీతాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవాణి ట్రస్టు, స్థానికుల ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలతో సమరసత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన రామాలయంలో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాముల విగ్రహ ప్రతిష్ఠను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలు
ఎటపాక, న్యూస్‌టుడే: సీతాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవాణి ట్రస్టు, స్థానికుల ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలతో సమరసత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన రామాలయంలో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాముల విగ్రహ ప్రతిష్ఠను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ధ్వజస్తంభం నిలిపారు. నవధాన్యాలు, మహిళల బిందెల ద్వారా నీటిని తీసుకొచ్చారు. సీతాపురం, తోటపల్లి, గన్నవరం, కాపవరం, ఎన్టీఆర్ కాలనీ, ఆవేర్‌కాలనీల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సమరసత సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్, ఉభయ గోదావరి జిల్లాల ధర్మ ప్రచారక్ జగన్నాథం, పద్మావతి, సన్యాసిరెడ్డి, జయమ్మ, శ్రీను, రామారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠను తిలకిస్తున్న భక్తజనం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.