logo

అధికార దాహం.. అదుపులేని ప్రచారం!

వైకాపా ప్రభుత్వ ప్రచారానికి అంతు లేకుండా పోతోంది. విద్యార్థులకిచ్చే పాఠ్యపుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చివరకు అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇచ్చే పాలప్యాకెట్లు, పోషకాహారం, చిక్కీలను సైతం తమ ప్రచారాస్త్రంగా వాడుకోవడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందుంటున్నారు.

Published : 28 Mar 2024 02:19 IST

విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరిట అందించిన సంచులు

చింతపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ ప్రచారానికి అంతు లేకుండా పోతోంది. విద్యార్థులకిచ్చే పాఠ్యపుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చివరకు అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇచ్చే పాలప్యాకెట్లు, పోషకాహారం, చిక్కీలను సైతం తమ ప్రచారాస్త్రంగా వాడుకోవడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందుంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అధికారులు బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న రాజకీయ నాయకుల చిత్రాలు, పోస్టర్లు, గోడపత్రికలు తొలగించారు. ఇక్కడవరకూ బాగానే ఉన్నా జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు ఇచ్చే పలు రకాల వస్తువులపై ఆ పథకం పేరు యథావిధిగా ఉంది. పాఠ్యపుస్తకాలపైనా పలు పథకాలకు సంబంధించిన పేర్లు, చిత్రాలు, లోగోలు ఉండిపోయాయి. వాటిని ఎలా తొలగించాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. భవిష్యత్తులో తమ ప్రచారానికి బాగా ఉపయోగపడతాయన్న ముందు చూపుతోనే ఇలా పాఠ్యపుస్తకాలపైనా పథకాల పేర్లు, లోగోలు ముద్రించి ఉంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిరోజూ విద్యార్థులు ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాంతోపాటు బెల్టులు, బ్యాగులు ధరించి బడులకు వెళుతున్నారు. వాటిపై జగనన్న విద్యాకానుక అని ఉంది. ఎన్నికల కమిషన్‌ ఈ తరహా వ్యవహారాలపై దృష్టి సారించాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని