logo

సైకో పాలనతో ప్రజలకు తీవ్రనష్టం

అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 20 Apr 2024 01:53 IST

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: అరకులోయ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆయన స్వగ్రామం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ లకేయిపుట్టులో గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జీవో నంబరు 3 రద్దుతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టాలని కోరారు. కూటమి నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

భారీ ర్యాలీగా నామినేషన్‌కు..

హుకుంపేట, న్యూస్‌టుడే: ఎన్టీఏ కూటమి అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్‌ సందర్భంగా హుకుంపేటలో శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టారు. గడుగుపల్లి గ్రామం నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు, కార్లతో నాయకులు, కార్యకర్తలు వందలాది మంది ర్యాలీగా పాడేరు చేరుకున్నారు. ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


తరలిన తెదేపా శ్రేణులు

ఎటపాక: రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి నామినేషన్‌ కార్యక్రమానికి మండలం నుంచి తెదేపా శ్రేణులు శుక్రవారం భారీగా తరలివెళ్లాయి. ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, నెల్లిపాక, గౌరిదేవిపేట, లక్ష్మీపురం, చోడవరం తదితర గ్రామాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు రంపచోడవరం వెళ్లారు. తెదేపా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.   సీనియర్‌ నాయకులు పాటి చలపతిరావు, దొంతు మంగేశ్వరరావు, కిలారి వెంకటేశ్వరరావు, నలజాల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని