logo

వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం

రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు.

Published : 01 May 2024 01:51 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. జానకయ్యపేటలో మంగళవారం రాత్రి నియోజకవర్గస్థాయిలో యాదవుల సమావేశం నిర్వహించగా రమేశ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రమేశ్‌ మాట్లాడుతూ దేశంలో యాదవులకు ప్రత్యేక స్థానం ఉందని, కేంద్రంలోనూ వీరు పలు కీలక పదవుల్లో ఉన్నారన్నారు. తెదేపా హయాంలో యాదవులకు తితిదే ఛైర్మన్‌ పదవి ఇచ్చారని గుర్తు చేశారు.  ఈనెల 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాళ్లపాలెంలో బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అనిత మాట్లాడుతూ బీసీలకు తెదేపా హయాంలో మాత్రమే మేలు జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తారని వివరించారు. కురందాసు నూకరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గింజాల లక్ష్మణరావు, దేవర సత్యనారాయణ, కురందాసు సింహాచలం, అల్లు నరసింహమూర్తి, వైబోయిన రమణ, గొనగాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సొంత చెల్లినే గౌరవించలేని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఎలా గౌరవిస్తారని, రాష్ట్రానికి ఏం మంచి చేయగలరని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత విమర్శించారు. ఉపమాక పంచాయతీ పరిధిలోని మనబాలవానిపాలెం, కొర్రవానిపాలెం గ్రామాల్లో మంగళవారం ఆమె తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు. జగన్‌ బహిరంగ సభల్లో తన చెల్లిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో గుర్తించాలన్నారు.


వైకాపా నుంచి తెదేపాలో చేరిక

ఉద్ధండపురానికి చెందిన వైకాపా నాయకులు పలువురు తెదేపాలోకి చేరారు. సారిపల్లిపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత వీరికి కండువాలు వేసి తెదేపాలోకి ఆహ్వానించారు. కొప్పిశెట్టి వెంకటేష్‌, కొప్పిశెట్టి కొండబాబు, పాకలపాటి రవిరాజు, గుద్దాటి సత్యనారాయణ, పాము గణేష్‌, పోలినాటి నానాజీ, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ తోట నగేష్‌, పొడగట్ల రమణ, తుమ్మల వెంకటకమణ తదితరులు పాల్గొన్నారు.


బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అన్నారు. తురకలపూడిలో మంగళవారం కూటమి నాయకులతో కలిసి గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దివాలా తీసిందని విమర్శించారు. తెదేపా హయాంలో అమలు చేసిన ఎన్నో పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జనసేన ఇన్‌ఛార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు, భాజపా నాయకుడు నాగరాజు, ఎం.వి.వి.సత్యనారాయణ, కోరుకొండ రవికుమార్‌, గేదెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని