logo

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్‌కిరణ్‌ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్‌పీఎఫ్‌, ఏపీఎస్‌పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.

Updated : 05 May 2024 05:10 IST

ఫజుల్లాబాద్‌ నుంచి ఇందుకూరుపేట వరకు పోలీసు బలగాల కవాతు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్‌కిరణ్‌ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్‌పీఎఫ్‌, ఏపీఎస్‌పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించారు.  

పెదబయలు, న్యూస్‌టుడే: పెదబయలు ఎస్సై మనోజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బాంబ్‌స్క్వాడ్‌ బృందం పెదబయలు నుంచి అరఢకోట, మంగబంద, చుట్టుమెట్ట, సిరసపల్లి, గంపరాయి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.  

దేవీపట్నం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని రంపచోడవరం సీఐ వి.వెంకటేశ్వరరావు, దేవీపట్నం ఎస్సై కె.వి.నాగార్జున పేర్కొన్నారు. శనివారం దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్‌ నుంచి ఇందుకూరుపేట వరకూ పోలీసు బలగాలు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గుర్తేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎన్నికల విధుల్లో భాగంగా హెలికాప్టర్‌ను వినియోగించనున్నారు. ఎగువ ప్రాంతంలోని ఎన్నికల బ్యాలెట్ పెట్టెలు హెలికాప్టర్‌ ద్వారా తరలించనున్నారు. ఇందుకోసం గుర్తేడులో ప్రత్యేకంగా హెలీప్యాడ్‌ నిర్మిస్తున్నారు హెలీప్యాడ్‌ పరిసరాలను బాంబ్‌, డాగ్‌ స్వ్కాడ్‌లతో తనిఖీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ తనిఖీలు చేసినట్లు గుర్తేడు ఎస్సై సాయికుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని