logo

సంక్షేమ పాలన త్వరలో సాకారం

సంక్షేమ పాలన కూటమి గెలుపుతో త్వరలోనే సాకారమవుతుందని పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలో తెదేపా కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు.

Published : 05 May 2024 01:58 IST

తెదేపాలో చేరిన వారితో అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, శ్రావణ్‌కుమార్‌

జి.మాడుగుల, న్యూస్‌టుడే: సంక్షేమ పాలన కూటమి గెలుపుతో త్వరలోనే సాకారమవుతుందని పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలో తెదేపా కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరారు. వారికి గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా నుంచి రెడ్డిబాబు, కాంగ్రెస్‌ నుంచి కరుకొల రామకృష్ణ, గూడెంకొత్తవీధికి చెందిన మాజీ సర్పంచులు పసుపులేటి రామకృష్ణ, కంకిపాటి నారాయణమ్మ, ఎన్‌. దేవమణితోపాటు పలువురు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరాజు సొంత పంచాయతీ కిల్లంకోటలోని పలు గ్రామాల నుంచి భారీగా తెదేపాలో చేరారు. ఈశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. సీనియర్‌ నాయకులు బొర్రా నాగరాజు, ఎస్‌.వి.రమణ, చల్లంగి లక్ష్మణరావు, రాజమండ్రి నారాయణ, ఎంపీపీ పద్మ, నేతలు వెంగలయ్య, కొండలరావు, చిరంజీవి, పాండురంగస్వామి, చిట్టిబాబు, కుమారి, అప్పలరాజు, జనసేన నాయకుడు భీమన్న, భాజపా నాయకులు రవికుమార్‌, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని