logo

కదల్లేని వారిపై కనికరమేది...!

ప్రతిపక్షాలపై కక్ష.. కదల్లేని పింఛను లబ్ధిదారులకు శాపంగా మారింది. వయోవృద్ధులకు ఇంటికే వెళ్లి పింఛన్‌ పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో పింఛన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Published : 07 May 2024 06:54 IST

80 ఏళ్లు దాటిన వృద్ధులకు నేటికీ అందని పింఛన్‌

పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు జోగులమ్మ, వెంకటరావు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ప్రతిపక్షాలపై కక్ష.. కదల్లేని పింఛను లబ్ధిదారులకు శాపంగా మారింది. వయోవృద్ధులకు ఇంటికే వెళ్లి పింఛన్‌ పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో పింఛన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గూడెంకొత్తవీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ చెక్కమద్ది గ్రామానికి చెందిన పాతూని జోగులమ్మకు 103 ఏళ్లు. ఈమె నడవలేదు. ఈమె బ్యాంకు ఖాతాలో నగదు వేశారట. ఆమె బ్యాంకుకు వెళ్లి పదేళ్లు పైనే అవుతోంది. ఖాతా మనుగడలో ఉందో లేదో తెలియని పరిస్థితి. అదే పంచాయతీలోని వండలం వెంకటరావు(85) అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు రాలేరు. పూజారి కాసులమ్మ(80), గుబులంగి కన్నమ్మ(82)లు కూడా కదల్లేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాస్తవానికి 80 ఏళ్లు పైబడిన వారికి బ్యాంకు ఖాతాల్లో కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికే వెళ్లి పింఛన్‌ పంపిణీ చేయాల్సి ఉంది. అయినా ఎవరూ అందించలేదని వారు వాపోతున్నారు. కేవలం ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు వృద్ధులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పలువురు పేర్కొన్నారు. అధికారులు స్పందించి వెంటనే పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు