logo

నేడు విశాఖలో చంద్రబాబు సభ

ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం విశాఖ రానున్నారు. విశాఖ దక్షిణం, ఉత్తరం నియోజకవర్గాలకు సంబంధించి సీతంపేట కూడలిలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ తెలిపారు.

Published : 09 May 2024 02:18 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం విశాఖ రానున్నారు. విశాఖ దక్షిణం, ఉత్తరం నియోజకవర్గాలకు సంబంధించి సీతంపేట కూడలిలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ తెలిపారు. సాయంత్రం 6.30గంటలకు సభ జరుగుతుందని, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు. తొలుత పేర్కొన్నట్లు రోడ్‌షో లేదన్నారు. రాత్రికి పార్టీ కార్యాలయ ఆవరణలోని బస్సులో చంద్రబాబు బస చేస్తారని, శుక్రవారం ఉదయం తిరుగు ప్రయాణమవుతారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని