logo

జూద శిబిరంపై పోలీసుల దాడి

బాపులపాడు, వేలేరు శివారులో ఓ పేకాట శిబిరంపై ఆదివారం హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఆత్మీయ కలయికలో భాగంగా మండలానికి చెందిన పలువురు ఓ తోటలో విందు ఏర్పాటు చేసుకున్నారు.

Updated : 28 Nov 2022 06:21 IST

ప్రముఖ నాయకులున్నారంటూ ప్రచారం

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: బాపులపాడు, వేలేరు శివారులో ఓ పేకాట శిబిరంపై ఆదివారం హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఆత్మీయ కలయికలో భాగంగా మండలానికి చెందిన పలువురు ఓ తోటలో విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జూద శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ నవీన్‌ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, సూర్యశ్రీనివాస్‌ దాడి చేశారు. ఓ నిర్వాహకుడ్ని, తొమ్మిది మంది జూదరుల్ని పట్టుకున్నామని, వీరి నుంచి రూ.10,500 నగదు, రూ.3,91,800 విలువ చేసే కాయిన్లు, పది చరవాణులు, ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన వారిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఉండటంతో ఈ వ్యవహారంలో హైడ్రామా చోటుచేసుకుంది. వీరంతా ప్రముఖ నాయకుల అనుచరులని, కేసినోతో సైతం వీరికి సంబంధాలు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడం, పట్టుబడిన వారందరికీ స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వకపోవడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుందనే ప్రచారం జరిగింది. దీనిపై సీఐని వివరణ అడగ్గా.. అందరికీ 41 నోటీసులు ఇచ్చి విడిచిపెట్టేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని