logo

ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి రావాలి

 ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.

Published : 08 Feb 2023 06:11 IST

రామలింగయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నాయకులు, కుటుంబ సభ్యులు

చల్లపల్ల్లి, న్యూస్‌టుడే:  ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఐ అగ్రనేత చండ్ర రామలింగయ్య వర్ధంతిని మంగళాపురంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో రామలింగయ్య సుస్థిరస్థానం పొందారన్నారు. ప్రధాని మోదీని, అదానీని విమర్శిస్తే దేశంపై దాడి చేస్తున్నట్లుగా అభివర్ణిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా పరిపాలన మారిందన్నారు. అభివృద్ధి శూన్యమని, ప్రజాస్వామ్యం లేదని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జల్లి విల్సన్‌ మాట్లాడుతూ రామలింగయ్య ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఘనంగా నడిపి పార్టీకి అండగా నిలిచారన్నారు. సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజాస్వామ్య గొంతుకలు బలపడాలని ఆకాంక్షించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాదబాబు అధ్యక్షతవహించగా నాయకులు టి.తాతయ్య, ఆర్‌.పిచ్చియ్య, చిన్నం కోటేశ్వరరావు, మల్లుపెద్ది రత్నకుమారి, అరసం మాధవరావు, వెలగపూడి ఆజాద్‌, దేవభక్తుని నిర్మల, దగాని సంగీతరావు తదితరులు ప్రసంగించారు. తొలుత రామలింగయ్య ఘాట్‌వద్ద ఆయన చిత్రపటానికి సీపీఐ నాయకులు, రామలింగయ్య కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని