logo

నిబంధనలు పాటించకుంటే చర్యలు

పది పరీక్షల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని జేసీ అపరాజితాసింగ్‌ ఆదేశించారు. శనివారం మచిలీపట్నంలోని ఓ వేడుక మందిరంలో పరీక్షల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 26 Mar 2023 05:04 IST

మాట్లాడుతున్న జేసీ అపరాజితాసింగ్‌, వేదికపై డీఈవో తాహెరా సుల్తానా తదితరులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: పది పరీక్షల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని జేసీ అపరాజితాసింగ్‌ ఆదేశించారు. శనివారం మచిలీపట్నంలోని ఓ వేడుక మందిరంలో పరీక్షల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్య, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో జిల్లాలో ఐదు ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. వీటి సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించాలన్నారు. ఎవ్వరూ చరవాణులు తీసుకెళ్లడానికి అవకాశం లేదన్నారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా అవసరం మేర ఆర్టీసీ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 22,436 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కానున్నారని జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా చెప్పారు. 143 కేంద్రాలు ఏర్పాటు చేయగా సీ కేటగిరి కేంద్రాలపై  పర్యవేక్షణకు 34 మంది కస్టోడియన్స్‌ నియమించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల పంపిణీకి 10 రూట్లు ఏర్పాటు చేసి అధికారులను నియమించామన్నారు. పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ డేవిడ్‌రాజు, డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణతో పాటు విద్యాశాఖ వివిధ విభాగాల అధికారులు ఎండీ మొమిన్‌, జిల్లా సైన్స్‌ అధికారి ఎండీ జాఖీర్‌ తదితరులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని