logo

AP Roads: ఎన్నాళ్లీ దౌర్భాగ్యం?

కృష్ణా జిల్లాలో అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రధాన రహదారుల్లో ఉయ్యూరు రవాణా శాఖ కార్యాలయ మార్గం ఒకటి.

Updated : 04 Oct 2023 11:49 IST

పెద్ద పెద్ద గుంతలతో ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయం రోడ్డు

కృష్ణా జిల్లాలో అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రధాన రహదారుల్లో ఉయ్యూరు రవాణా శాఖ కార్యాలయ మార్గం ఒకటి. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి నుంచి ఆర్టీవో కార్యాలయ రోడ్డు చీలి పమిడిముక్కల మండలం మంటాడ శివాలయం వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుకు అనుసంధానమై ఉంది. సుమారు అర కిలోమీటరు రహదారి ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురికావడం వల్ల పెద్ద పెద్ద గుంతలతో నరకాన్ని తలపిస్తోంది. కొంతకాలంగా కనీసం నడవడానికి కూడా వీలులేని విధంగా తయారైంది. వర్షం వస్తే గుంతల్లో నీరు చేరి చెరువును తలపిస్తోంది. ఆ సమయంలో చోదకులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వాహనాలు నడపాల్సిందే. అభివృద్ధి చేయాలని ప్రజలు పలుమార్లు విజ్ఞప్తులు చేస్తుంటే.. ఈ రోడ్డు తమ పరిధిలోకి రాదంటూ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ఈ సమస్యను ఆర్‌అండ్‌బీ డీఈ బలరామ్‌ వద్ద ప్రస్తావించగా.. గతంలో ఇది ఉయ్యూరు బైపాస్‌ పరిధిలో ఉన్నందున జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రోడ్డు వేయాల్సి ఉందన్నారు. కానీ ఎన్‌హెచ్‌ విభాగం మాత్రం ఈ సమస్య తమదికాదన్న రీతిలో చోద్యం చూస్తోంది. ఫలితంగా ప్రజలకు, వాహనచోదకులకు ఇక్కట్లు తప్పడం లేదు.

 న్యూస్‌టుడే, ఉయ్యూరు

భయం భయంగా నడుస్తున్న వాహనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు