logo

గ్రావెల్‌ అక్రమ రవాణా.. అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

అర్ధరాత్రి కొండ గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న వారిని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్య, ఆ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు పట్టుకున్నారు.

Updated : 14 Nov 2023 10:28 IST

నందిగామ: అర్ధరాత్రి కొండ గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న వారిని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్య, ఆ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు పట్టుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం కొండ నుంచి యంత్రాలతో గ్రావెల్ తవ్వి కొంత మంది అక్రమార్కులు లారీలతో తరలిస్తున్నారు. ఈ క్రమంలో వారంతా అక్కడికి చేరుకొని అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అనంతరం పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పొక్లెయిన్‌లు, లారీలను పోలీసులకు అప్పగించారు. 

గ్రావెల్‌ అక్రమ రావాణాపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సౌమ్య, ఇతర తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. గత కొన్నేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అనుచరులు భారీగా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు