logo

ప్రలోభాలు అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు

జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు తెలియజేశారు.

Published : 28 Mar 2024 05:57 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజబాబు, జేసీ గీతాంజలి శర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు

ఈనాడు డిజిటల్‌ - మచిలీపట్నం: జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ముఖేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అనుమతులు మంజూరు, ఇంటి నుంచే ఓటింగ్‌ (హోం ఓటింగ్‌), పోస్టల్‌ బ్యాలెట్‌ తదితరల అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. హోం ఓటింగ్‌లో 85 ఏళ్లు పైనున్న వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువున్న దివ్యాంగులను సంప్రదించి వారు వాస్తవంగా పోలింగ్‌ కేంద్రానికి వస్తారా రాలేరా గమనించి 12డీ అభ్యర్థన దరఖాస్తు తీసుకోవాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి సైతం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. జేసీ గీతాంజలి శర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, రిటర్నింగ్‌ అధికారులు వెంకటరమణ, బాలసుబ్రమణ్యం, పద్మావతి, డి.రాజు, శ్రీదేవి పలువురు నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 31 వరకే ధాన్యం సేకరణ... 2023-24 ఖరీఫ్‌ పంట కాలానికి ధాన్యం కొనుగోళ్లు ఈనెల 31తో ఆపేస్తున్నట్లు జేసీ గీతాంజలిశర్మ తెలిపారు. జిల్లా రైతులు విక్రయించదలచిన ధాన్యాన్ని సత్వరమే సంబంధిత కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లాలో నేటికి 55,562 మంది రైతుల నుంచి రూ.1,070.07 కోట్ల విలువైన 4,88,590.36 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా సేకరించినట్లు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని